SSC EXAMS -Instructions to Students




                        *పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు కొన్ని సూచనలు*
 
👉 *ప్రతిరోజు ఉదయం 9 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.*

👉 *పరీక్ష కేంద్రం బయట ఏ గదిలో ఏ హాల్ టికెట్ నెంబర్ నుండి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు కేటాయించబడినవో డిస్ప్లే ఉంటుంది దాని లో మీ గదిని చూసుకొని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి.*

👉 *మీకు కేటాయించబడిన గదిలోకి వెళ్లి మీకు కేటాయించబడిన స్థలంలో 9.15 లోపు కూర్చోవాలి.*

👉 *9.15 తర్వాత మీకు కేటాయించబడిన ఇన్విజిలేటర్ గారు OMR షీట్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది.*

👉 *మెయిన్ ఆన్సర్ షీట్ పైన మూడు అంకెల క్రమసంఖ్య రాయ బడి ఉంటుంది.* 

👉 *ఈ సంఖ్యను ఓ ఎం ఆర్ షీట్ నందు పార్ట్ 1& పార్ట్ 2 రెండు చోట్ల రాయాల్సి ఉంటుంది.*

👉 *ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే దానిలో ముద్రించబడిన మీ పేరు, మీడియం ,రాస్తున్న పరీక్ష పేరు వివరాలు ప్రతి రోజూ తప్పక సరి చూసుకోవాలి.*

👉 *సరి చూసుకున్న తర్వాత ఓఎంఆర్ షీట్ను మెయిన్ ఆన్సర్ షీట్ కు స్టాపిల్ (పిన్)చేసి దాని మీదుగా రెండు చోట్ల ఒకవైపు అర్థ వృత్తాకారం వచ్చే విధంగా స్టిక్కర్ ను అతికించుకోవాలి.*

👉 *మెయిన్ ఆన్సర్ షీట్ లో మొదటి పేజీ నందు సూచనలు ఉంటాయి కాబట్టి రెండవ పేజీ నుండి జవాబులు రాయడం మొదలు పెట్టాలి ఓఎంఆర్ షీట్ లో మీ వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత మీరు సంతకం చేసినట్లయితే మీ సంతకం క్రింది భాగంలో ఇన్విజిలేటర్ గారు సంతకం చేస్తారు. మీ యొక్క సంతకం చేసే గ‌డిని సరిగ్గా చూసుకొని నాలుగు గీతలకు తగలకుండా మీ సంతకాన్ని హాల్ టికెట్ లో ఉన్న మాదిరిగా చేయవలసి ఉంటుంది.*

👉 *ఇన్విజిలేటర్ అందించే అటెండెన్స్ షీట్ నందు మీ హాల్టికెట్ మాదిరిగా వివరాలన్నీ నమోదు చేయబడి, మీరు రాసే పరీక్ష తేది, పేపర్ కోడ్ క్రింద ఖాళీ గ‌డి ఉంటుంది. ఏ రోజు ఏ పరీక్ష రాస్తున్నారో ఆ తేదీ పరీక్షకు సరిచూసుకొని ఆ ఒక్క గదిలో మాత్రమే మీరు సంతకం చేయవలసి ఉంటుంది.*

👉 *ఈ ప్రక్రియ అంతా 9 గంటల 30 నిమిషాల వరకు పూర్తి చేయబడినట్లయితే 9.30కు మీకు ప్రశ్నా పత్రం ఇవ్వడం జరుగుతుంది.*

👉 *ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాల పాటు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. పరీక్ష పేపరు చదువుకోవడానికే 15 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది.*

👉 *జవాబులు రాయడం మొదలు పెట్టిన తర్వాత ప్రతి జవాబు ముగిసిన వెంటనే ఒక లైన్ గీసినట్లయితే ఎగ్జామినర్ కు మీ జవాబు అక్కడికి పూర్తయినది అని తెలిసి మార్కుల కేటాయింపు సులభమవుతుంది*

👉 *చివరి అరగంట సమయం మిగిలి ఉన్నప్పుడు మీకు పార్ట్-బి ఇవ్వడం జరుగుతుంది.పార్ట్-బి సమాధానాలు రాసేటప్పుడు ఎలాంటి దిద్దుబాటు కానీ, ఓవర్ రైటింగ్ కానీ, రౌండ్ చేయడం కానీ ఉండరాదు. మీరు సరిగా ఆలోచించుకొని ఒకే ఒక్క సరి అయిన ఆప్షన్ మాత్రమే బ్రాకెట్లో రాయాలి*

👉 *మీరు అడిషనల్ తీసుకున్న ప్రతి సారి కుడి వైపు పై భాగాన చిన్నగా పెన్సిల్ తో 1,2,3 అని అడిషనల్ యొక్క క్రమ సంఖ్యను వేసుకున్నట్లయితే చివరగా పేపర్ను క‌ట్ట‌డం సులభమవుతుంది.*

👉 *జవాబులు అన్నీ రాయడం ముగిసిన తర్వాత ఇంకనూ అడిషనల్ పేపర్ లో ఖాళీ స్థలం ఉన్నట్లయితే చివరి జవాబు తర్వాత మిగిలిన ఖాళీ స్థలంలో కర్ణం మాదిరిగా గీత గీసి మీ పరీక్ష పత్రాన్ని ఇన్విజిలేట‌ర్కు అందజేయాలి.*

*ఇన్విజిలేటర్ కు జవాబు పత్రాన్ని  అందజేయడానికి కన్నా ముందు ప్రధాన జవాబు పత్రం తోపాటు అడిషనల్ జవాబు పత్రాలన్నీ క్రమంలో ఉన్నాయో లేదో సరి చూసుకొని సరిగ్గా అంటే గట్టిగా ముడి ఊడిపోకుండా ట్యాగ్ కట్టి ఇవ్వాల్సి ఉంటుంది.*

*పరీక్ష సమయం 12 గంటల 30 నిమిషాల వరకు కాబట్టి మీరు అంతకుముందే జవాబులు రాయడం పూర్తి చేసినప్పటికీ మిమ్మల్ని 12.30 వరకు ఎగ్జామ్ సెంటర్ విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వరు.*

*ప్రత్యేక సందర్భాలు:*

👉 *గణితం పేపర్ కొరకు మీరు గ్రాఫ్ పేపర్ ఉపయోగించినట్లయితే దానిని అడిషనల్ పేపర్ ల తర్వాత పార్ట్ బి కన్నా ముందుగా కట్టాల్సి ఉంటుంది*

👉 *భౌతిక రసాయన శాస్త్ర పరీక్ష ఒక గంట ముప్పై  నిమిషాలు, జీవశాస్త్ర పరీక్ష ఒక గంట ముప్పై  నిమిషాలు ఉంటుంది. ఆ ఒక గంట ముప్పై  నిమిషాల లో చివరి 30 నిమిషాలముందు ఆయా సబ్జెక్టుల పార్ట్-బి లు ఇవ్వబడతాయి *


👉 *అదేవిధంగా సాంఘికశాస్త్ర పరీక్షలో మ్యాప్ పాయింటింగ్ కొరకు ఇచ్చినటువంటి మ్యాప్ను కూడా అడిషనల్ పేపర్ ల తర్వాత కట్టి చివరగా పార్ట్ బీ కట్టాల్సి ఉంటుంది.*

👉 *ముఖ్య గమనిక: హాల్టికెట్ నెంబర్ ను   కేవలం ప్రశ్నపత్రం పైన మాత్రమే రాయాలి. మ‌రి ఎక్క‌డ కూడా రాయరాదు.*
*జవాబులు రాయడం పూర్తయిన తర్వాత నంబర్ ఆఫ్ అడిషనల్ అనగా మీరు తీసుకున్న అడిషనల్ ల‌ సంఖ్యను లెక్కించి ప్రధాన జవాబు పత్రం పై ఒక చోట ఓఎంఆర్ షీట్ నందు పార్ట్ వన్ పార్ట్ 2 మొత్తం మూడు చోట్ల సంఖ్య వ్రాసి ఇన్విజిలేట‌ర్కు అందజేయాల్సి ఉంటుంది.*

*All the Best*