Moral Story : 76

 నీతి కథలు - 265

స్వార్థపరుడి పెత్తనం

    సీతమ్మకు తాను ధనవంతురాలినన్న అహం ఎక్కువ. ఆ అహంకారంతోనే ఆమె, వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఆడబడుచు కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చింది. ఆడబడుచుది పొరుగూరు. ఆమె భర్త పోయి, ఒక్కగానొక్క కూతురుతో దిగాలు పడుతున్న పరిస్థితిలో కూడా, ఆమెపట్ల కించిత్తూ జాలి చూపించక, తిరిగి తన గ్రామానికి వచ్చేసింది. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే తల్లి కూడా పోయి దిక్కులేనిదానిలా మిగిలిన ఆడబడుచు కూతురు పదహారేళ్ళ అరుణ బాధ్యత, సీతమ్మకు తప్పనిసరైంది. 

పోయిన ఆడబడుచుకు జరగవలసిన కర్మకాండ అంతా ముగియగానే , ఆమె తిరిగి తన గ్రామానికి ప్రయాణం  కట్టింది. ఆ సమయంలో లో ఊరి పెద్దలిద్దరు ముగ్గురు, ఆమెతో, ‘‘ఇదిగో, సీతమ్మగారూ! నీ మేనకోడలు అరుణను ఒక్కర్తెనూ వదిలేసిపోతావేమో! అంతపని మాత్రం చెయ్యకు . ఎంత లేదన్నా మేనత్తవి. పిల్లను ఇంటి కోడల్ని చేసుకోలేకపోతేపోయావు,. తీసుకుపోయి దగ్గర ఉంచుకుని, కలో గంజో పొయ్యి,'' అని మొహం మీదే చెప్పడంతో, ఇక చేసేది లేక - పోనీ ఇంటిచాకిరీకైనా పనికొస్తుందిలే అని సరిపెట్టుకుని, అయిష్టంగానే అరుణను తన ఇంటికి తీసుకువచ్చింది.

     తను ఇంట చేరిన మరునాడే మేనత్త, పనిమనిషిని మానిపించింది. ఆ క్షణం నుంచీ, ఇంటెడు చాకిరీ తన నెత్తిన రుద్దేసరికి అరుణ మనసులో చిన్నబుచ్చుకున్నా, వెంటనే సర్దుకుని ఇంటెడు పనీ చెయ్యడానికి  అలవాటు పడింది. ఇంట్లో ఉండేది మొత్తం ఐదుగురు. సీతమ్మ, ఆమె ఒక్కగానొక్క కొడుకు సూర్యంతో పాటు సీతమ్మకు స్వయానా  అన్నగారైన పద్మనాభయ్య , ఆయన ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళల్లో పెద్ద కూతురు మాలతి, సూర్యానికి కాబోేు పెళ్ళామని గ్రామమంతా చెప్పుకుంటారు.


    సూర్యం మంచివాడు, తెలివైన వాడిలా కనిపిస్తాడు. ఐతే, ఇంటి వ్యవహారాలేవీ సూర్యం మాట మీద జరగవు. మొత్తం పెత్తనమంతా పద్మనాభానిదే. ఆయనే, పొలాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ పంట వెయ్యాలి , ఏ ధరకు ఎవరికి అమ్మాలి అన్న విష…ూలన్నీ నిర్ణయిస్తాడు. రైతులూ, వ్యాపారులూ అందరూ ఆయ నతోనే మాట్లాడుతారు. ఇక ఇంటి అలంకరణ దగ్గర్నించీ, పండగలకు పబ్బాలకు చేసే పిండివంటల వరకూ పెత్తనమంతా మాలతిది. ‘‘మీ మామయ్య  పోయినప్పటినుంచీ, మా అనే్న్యు మాకు అన్నీ చూసి పెడుతున్నాడు.

 

ఇక మాలతి లేకపోతే మాకు ఒక్కపూట కూడా గడవదు,'' అంటూ అరుణ దగ్గర సగర్వంగా మాట్లాడేది సీతమ్మ. ఒకరోజు సూర్యం, పద్మనాభంతో, ‘‘ఈసారి వరి ఎక్కువగా వె…్యువద్దు, మామ…్యూ! మొన్నటి పంటలో వరి దిగుబడే ఎక్కువగా ఉండి, పప్పుధాన్యాలకు కొరతగా ఉందని పట్నం నుంచి వచ్చిన, నా మిత్రుడొకడు చెప్పాడు. అందుచేత పప్పుధాన్యాలు ఎక్కువగా పండిస్తే, మనకు మంచి లాభాలు వస్తాయి!'' అని అనడం, ఆ పక్క వరండాలో కూర్చుని కందులు విసురుతున్న అరుణ చెవిన పడింది.

 

ఆ మరుక్షణం, పద్మనాభం కసురుతున్నట్లుగా, ‘‘అదే బురల్రేని తనం! అందరూ నీలాగే ఆలోచించి పప్పుధాన్యాలే వేస్తే, మనకొచ్చే లాభం సున్నా! అంచేత వరే వేద్దాం,'' అన్నాడు. ‘‘కానీ, ఈ చుట్టుపక్కల చాలా పొలాలు వరికి మాత్రమే అనుకూలమైనవి, మామ…్యూ! మనలా వరి, పప్పుధాన్యాలు రెండూ చక్కగా పండే శ్రేష్ఠమైన భూములు వున్నవాళ్ళు చాలా తక్కువ. అందువల్ల, చాలా మంది వరే వేస్తారు,'' అన్నాడు సూర్యం.

 

‘‘అదిగో, మళ్ళీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. పట్నం నుంచి ఎరువులు కొనుక్కొచ్చి, రాతి నేలలో కూడా బంగారం పండించేస్తున్నారు, మన గ్రామం వాళ్ళు. అంచేత మనం కొరివితో తల గోక్కోకుండా వరే వేద్దాం, సరా!'' అన్నాడు పద్మనాభం. ‘‘అదేం లేదు, మామ…్యూ!'' అంటూ సూర్యం ఏదో చెప్పబోేుంతలో, అక్కడే వున్న సీతమ్మ కల్పించుకుని, ‘‘ఒరే! మామ…్యు పెద్దవాడు. అనుభవంతో చెబు తూంటే, కాదంటూ ఒకటే వాదిస్తావేమిట్రా? అలాగే, అన్న…్యూ, వరే వేద్దాంలే.

    వాడు చిన్నవాడు, ఏమీ తెలియని తనం. వాడి మాటలు పెద్దగా పట్టించుకోకు,'' అన్నది. ఆ మాటలు వింటూనే అప్ర…ుత్నంగా సూర్యంకేసి చూసిన అరుణకు, అతడు మొహం చిన్నబుచ్చుకోవటం, పద్మనాభం పెద్దకూతురు మాలతి చిన్నగా నవ్వడం కనిపించాయి. ‘‘ఇప్పటి పరిస్థితుల్లో నాకు విలువ లేదు. కానీ ఇంటి …ుజమాని అయి ఉండీ కూడా బావకు విలువ లేదు. నాకంటే అతడి పరిస్థితి మరీ అన్యాయం !'' అనుకుని జాలిపడింది అరుణ.

    ఆ తర్వాత నెల రోజులకు దేవీ నవరాత్రులు సమీపించాయి. గ్రామపెద్దలు తొమ్మిది రోజులూ తొమ్మిది కార్యక్రమాల్ని, తలొకటీ చొప్పున ఏర్పాటు చె…్యుటం, ఆ గ్రామం ఆనవాయితీ. భోజనాల…్యూక ఇంట్లో అందరూ తీరిగ్గా కూర్చుని వున్న సమ…ుంలో పద్మనాభం, ‘‘ఎప్పుడూ మనకు అలవాటుగా వచ్చి హరికథ చెప్పే భాగవతారుకు, ఒంట్లో బాగాలేదట! రాలేనని కబురు పంపించాడు. మరొక భాగవతారుకు కబురు చేస్తున్నాను,'' అన్నాడు.

    సూర్యం ఉత్సాహంగా, ‘‘అలా అయితే హరికథ వద్దు, మామయ్యా ! పెద్ద రైతు రామయ్య  ఎటూ హరికథే పెట్టిస్తాడు. నటరాజ నాటక సమితి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళచేత మహిషాసుర మర్దనం నాటకం వేయిద్దాం. గ్రామంలోని వాళ్ళకు కొత్త కాలక్షేపం, మనకు మంచి పేరు!'' అన్నాడు. పద్మనాభం వెంటనే, ‘‘నీకు తెలివిగా ఆలోచించటం ఎప్పటికొస్తుందో, నాకు తెలియ డం లేదురా! ఖర్చు మాట అలా ఉంచి, దేవీ నవరాత్రుల్లో నాటకాలూ అవీ ఏమిటని, ఎవరైనా అన్నారంటే, ఉన్న పరువు కూడా పోతుంది,'' అన్నాడు.

    ఇలా అయినదానికీ కానిదానికీ మేనల్లుడి మీద, పద్మనాభం పెత్తనం చెలాయించటం అరుణకు చాలా కోపం తెప్పించింది. అయితే, ఈ సంఘటన జరిగిన వారం రోజులకు, విచిత్రంగా నటరాజ నాటక సమితికి చెందిన ఒక వ్యక్తి వచ్చి, గ్రామంలోని పెద్దలను కలుసుకుని, తానెవరైనదీ చెప్పి, నవరాత్రులకు మహిషాసుర మర్దనం నాటకం ఇక్కడ ఉచితంగా ప్రదర్శిస్తామని మొక్కుకున్నాం, అందుకు అనుమతించవలసిందిగా కోరాడు.

    తమకు కొత్త కాలక్షేపం దొరుకుతుందని సంతోషిస్తూ అందుకు పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తన మాట నెగ్గకపోయినా, తన కోరిక నెరవేరుతున్నందుకు, సూర్యం చాలా సంతోషించాడు. పాడ్యమినాడు ప్రదర్శింపబడిన, ఆ నాటకం, చిన్నాపెద్దా తేడా లేకుండా, గ్రామస్థులందర్నీ విశేషంగా ఆకట్టుకున్నది. తమకు లభించిన ఆ అశేష ఆదరణకు, నాటక సమితి అధ్యక్షుడు పరమానందభరితుడై వేదిక మీద నిలబడి, ‘‘మా నాటకం మీ అందరికీ నచ్చినందుకు చాలా కృతజ్ఞులం.

    మేము మొక్కుకోవడం, ఉచిత ప్రదర్శనా - అదంతా నిజం కాదు. ఇందుకు బాలాత్రిపుర సుందరీదేవితో పాటు మీరూ మమ్మల్ని క్షమించాలి. నాలుగు రోజుల క్రితం ఒక …ుువకుడు, మా దగ్గరకు వచ్చి, ఇక్కడ నాటకం ప్రదర్శించేందుకు మేమడిగిన డబ్బు ఇచ్చాడు. కానీ, కారణం తెలి…ుదు, తన పేరు గుప్తంగా ఉంచమని చెప్పాడు. అయినప్పటికీ, మా ప్రదర్శనకు మీరిచ్చిన ప్రశంసల్లో ఆ…ునది ముఖ్య భాగం.

    అందుకని ఆ…ున పేరు చెప్పక తప్పదు; సూర్యంగారు,'' అంటూ ముగించాడు. ఊహించని విధంగా, నాటక సమితి అధ్యక్షుడు తన పేరు చెప్పడంతో సూర్యం తెల్లబోయి, ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ, ఇంటికి బయ లుదేరబోతుండగా, గ్రామస్థులంతా అతణ్ణి చుట్టుముట్టి, ‘‘సూర్యం, ఏమో అనుకున్నాంగానీ, నువ్వు మహా గట్టివాడివయ్యా ! 

    ఇంత కాలంగా నువ్వు మేనమామ చాటు బిడ్డవనుకుంటున్నాం. కానీ, నువ్వు మంచి వ్యవహారకర్తవు!'' అంటూ ప్రశంసించారు. ఆ మర్నాడు అరుణ, సూర్యాన్ని ఒంటరిగా కలుసుకుని, ‘‘ఈ జరిగినదానికి నువ్వు చాలా ఆశ్చర్యపడి ఉంటావు బావా, అవునా? నేను తెర వెనక ఉండి, ఈ కథంతా నడిపినందుకు ఏమీ అనుకోకు. మా గ్రామాధికారి, మాకు చాలా దగ్గరి చుట్టం. మా అమ్మ పోతూ, నాకోసం ఒక చిన్న మొత్తం ఆ…ున దగ్గర ఉంచింది. మన పాలికాపు నారా…ుణకు సంగతి సందర్భాలన్నీ చెప్పి, ఆ…ునకు కబురు పంపాను.

    ఆయ న, ఈ పనికి నేనే నా డబ్బు ఖర్చు పెట్టగలను. అరుణ నాకు పరాయిదేం కాదు! అని, నారాయ ణకు చెప్పి, ఈ ఏర్పాటంతా చేశాడు. సూర్యం పేరుతో నాటకాలవాళ్ళ వద్దకు వెళ్లినవాడు, ఆయన కడగొట్టు కొడుకు! నీ అంతట నువ్వుగా, నీ మేనమామ పద్మనాభానికి ఎదురు తిరిగే పరిస్థితి లేదనిపించి, నేను స్వతంత్రించాను. ఇప్పటికైనా కాస్త చురుకుదనంతో నువ్వు స్వయం  నిర్ణయా లు తీసుకుంటూ, ఆ స్వార్థపరుడి పెత్తనం నుంచి బయ ట పడటం గురించి ఆలోచించు,'' అని చెప్పింది.

    అరుణ మాటలకు సూర్యం నవ్వుతూ, ‘‘అరుణా! ఈ దేవీ నవరాత్రుల్లో చేసింది, మరొక తరహా మహిషాసుర మర్దనం. నువ్వు నన్ను విముక్తుణ్ణి చేశావు. ఈ క్షణం నుంచీ ఇల్లూ, పొలాల విషయం లో ప్రతి నిర్ణయం  నాదే! దానితో పాటు మరొక ముఖ్య నిర్ణయం  కూడా తీసుకున్నాను,'' అన్నాడు. ‘‘ఏమిటా ముఖ్య నిర్ణయం  బావా!'' అంటూ అరుణ ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది.

    ‘‘మరేం లేదు, నిన్ను జీవితాంతం, నా మంత్రిగా నియమించుకుని, నీ సలహా సంప్రదింపులతో జీవించాలన్నది!'' అన్నాడు సూర్యం. మంచి భార్య, భర్తకు సలహాలివ్వడంలో మంత్రిలా నడుచుకుంటుందన్న పెద్దల మాటలు తెలిసిన అరుణ, అతడి మాటల్లోని అంతరార్థం గ్రహించి, చిరునవ్వుతో  తల వంచుకున్నది.

                                                                                   
  ◦•●◉✿ - ✿◉●•◦
🌻 మహానీయుని మాట🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
" తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు,కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు, ఏ పని అల్పమైనది కాదు "
          - స్వామి వివేకానంద
     。☆✼★━━━━★✼☆。
🌹 నేటీ మంచి మాట 🌼
     ♡━━━━━ - ━━━━♡
" క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది."